ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన సైనా, సింధు
- August 25, 2017
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పీవీ సింధు చరిత్ర సృష్టించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లలో వీరిద్దరూ విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లారు. ఈ విజయాలతో వీరిద్దరూ పతకాలను ఖాయం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో అద్భుత విజయం సాధించిన సింధు సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో చైనా షట్లర్ సన్ యూపై ఆధిపత్యం ప్రదర్శించి 21-14, 21-9 తేడాతో విజయం సాధించింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడి ప్రత్యర్థి పుంజుకునేందుకు అవకాశం ఇవ్వకుండా చెలరేగిన సింధు ముందు సన్‌యూ నిలవలేకపోయింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఇది ఆమెకు మూడో పతకం కానుండటం విశేషం. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్ కూడా సింధునే. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం సింధు నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఇక క్వార్టర్ ఫైనల్‌లో సైనా నెహ్వాల్.. స్కాట్లాండ్ క్రీడాకారిణి గిల్‌మార్‌పై 21-19, 18-21, 21-15 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది.
శనివారం జరిగే సెమీస్‌ల్లో సైనా, సింధు విజయం సాధిస్తే.. ఆదివారం జరిగే ఫైనల్‌లో వీరిద్దరూ తలపడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







