దక్షిణ కొరియా నుంచి బంగారం దిగుమతులు బ్యాన్
- August 25, 2017
దక్షిణ కొరియా నుంచి విపరీతంగా బంగారం, వెండి దిగుమతులు పెరుగుతుండటంతో, వీటిపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఉత్పత్తులను నియంత్రిత కేటగిరీలోకి చేర్చింది. దీంతో బంగారం, వెండిని దిగుమతి చేసుకోవాలంటే దిగుమతిదారులు ముందస్తుగా ప్రభుత్వం వద్ద నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి ఆగస్టు 21 వరకు మధ్య కాలంలో దక్షిణ కొరియా నుంచి 1 బిలియన్ డాలర్ల విలువ కలిగిన బంగారం దిగుమతులు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాయిన్లు, ఆభరణాల రూపంలో అన్ని రకాల బంగారం, వెండి ఉత్పత్తులపై ఈ పరిమితి విధిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
బేసిక్ కస్టమ్ డ్యూటీ లేకుండా దక్షిణ కొరియాకు, భారత్‌కు మధ్య ఉచిత వాణిజ్య ట్రేడ్ జరుగుతోంది. ఉచిత వాణిజ్య ఒప్పందం లేని దేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం ఉత్పత్తులపై 10 శాతం కస్టమ్ డ్యూటీ ఉంది. చైనా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద బంగారం వినియోగదారునిగా భారత్ ఉంది. ప్రస్తుతం 400 ప్లస్ ఉత్పత్తులు నియంత్రిత దిగుమతుల జాబితాలో ఉన్నాయి. వాటిలో జంతువులు, కొన్ని విత్తనాలు, యూరేనియం, పేలుడు పదార్థాలున్నాయి. డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగానే ఈ నిషేధం ఉందని, ఎఫ్‌టీఏ నిబంధనలను ఇది ఉల్లంఘించడం లేదని అధికారులు పేర్కొన్నారు. జూలైలో బంగారం దిగుమతులు 95 శాతం పెరిగాయి.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







