హర్యానా ప్రభుత్వంపై హోకోర్టు ఆగ్రహం
- August 26, 2017
పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు హర్యానా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయంగా లబ్ధి పొందేందుకే ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం 'పంచకుల'ను తగులబెట్టేలా చేసిందని శనివారం కోర్టు వ్యాఖ్యానించింది.
సీబీఐ కోర్టు తీర్పు అనంతరం రెచ్చిపోతున్న డేరా సచ్చా సౌధా అనుచరులను కట్టడి చేయకుండా వారికి ప్రభుత్వం లొంగిపోయిందని న్యాయమూర్తి అన్నారు. గుర్మీత్ కోర్టుకు వెళ్తున్న సమయంలో అన్ని వాహనాలను ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు.
పంచకుల తగలబడుతుంటే వీక్షకుల్లా చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ
పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినా ఆపే ప్రయత్నం చేయలేదని మండిపడింది.
పంచకుల తగులబడటానికి కారణమైన ఇద్దరు గుర్మీత్ అనుచరులపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వారిపై దేశ ద్రోహం కేసు నమోదైంది.
అంతేగాక, గుర్మీత్ ఆస్తుల వివరాలను ఆగస్టు 29లోగా కోర్టు ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా, పంచకుల సీబీఐ తీర్పుకు 72 గంటల ముందు నుంచే హర్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది.
సున్నితమైన ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సేవలను కూడా నిలిపివేసింది.
అయితే, డేరా అనుచరుల దుశ్చర్యల ముందు పోలీసు శక్తి సరిపోలేదు. కాగా, ప్రస్తుతం ఆర్మీ, పారామిలటరీ బలగాలు సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయం నుంచి అనుచరులను బయటకు తరలించేందుకు యత్నిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా, పంచకుల ఘటనకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి ఖట్టర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పంచకులలో ఆందోళనకారులను కట్టడి చేయడంలో విఫలమైన నేపథ్యంలో పంచకుల డీసీపీని సస్పెండ్ అయ్యారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







