ఐడియాకు జరిమానా ట్రాయ్ ఆదేశాలు
- August 26, 2017
వినియోగదారుల దగ్గర నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసినందుకు గాను ఐడియా సెల్యులర్‌కు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) జరిమానా విధించింది. రూ.2.97కోట్లు చెల్లించాల్సిందిగా ట్రాయ్ విడుదల చేసిన నోటీసుల్లో పేర్కొంది. మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ్‌బంగ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఐడియా వినియోగదారుల నుంచి అత్యధిక ఛార్జీలు వసూలు చేసినందుకు గాను ఈ జరిమానా విధించింది. మే 2005 నుంచి 2007 జనవరి మధ్యలో ఐడియా వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్, ఎంటీఎన్‌ఎల్ నెట్‌వర్క్‌కు కాల్స్ చేసినపుడు ఈ అధిక ఛార్జీలు వసూలు చేశారు.
టెలికం కన్జ్యూమర్స్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్(టీసీఈపీఎఫ్)కు 15 రోజుల్లో ఐడియా రూ.2,97,90,173 జరిమానాను కట్టాల్సిందిగా శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఒకే రాష్ట్రంలో ఒక సర్వీస్ నుంచి మరో సర్వీస్‌కు ఫోన్లు చేసుకున్న సమయంలో వేర్వేరు ఛార్జీలను ఐడియా వసూలు చేసినట్లు ట్రాయ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







