టాప్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న కళ్యాణ్ రామ్
- August 26, 2017
నందమూరి కళ్యాణ్ రామ్ రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్స్ ని సెలక్ట్ చేసుకునే ఈ హీరోకి పటాస్ తర్వాత హిట్ లేదు. దీంతో ఈ సారి ఎలా అయినా హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని మరి, రెండు సినిమాలు స్టార్ట్ చేశాడు.
కళ్యాణ్ రామ్ నటిస్తున్న చిత్రాల్లో ఎమ్.ఎల్.ఎ ఒకటి. ఉపేంద్ర మాధవ్ అనే కొత్త దర్శకుడు ఈ మూవీతో పరిచయం అవుతున్నాడు. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో కళ్యాణ్ రామ్ కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో క్యూరియాసిటీ ఏర్పడింది.
ఎమ్.ఎల్.ఎ చిత్రంతో పాటే మరో సినిమాని పట్టాలెక్కించాడు కళ్యాణ్ రామ్. తమిళ యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ జయేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు. టాప్ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తుండటం విశేషం. ఇందులో హీరోయిన్ గా మలయాళంలో రెండు సినిమాలు చేసిన ఐశ్వర్య లక్ష్మిని సెలక్ట్ చేశారు.
అయితే ఐశ్వర్యలక్ష్మి క్యారెక్టర్ కు తగ్గ పెర్ఫార్మెన్ చేయలేకపోతుందనే కారణంతో, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి స్టార్ హీరోయిన్ తమన్నాని తీసుకున్నారు. తమన్నా యాడ్ అవ్వడంతో ఈ సినిమాకి కూడా కాస్త హైప్ వచ్చింది. కెరీర్లో ఎక్కువగా కొత్త వాళ్ళతోనే సినిమాలు చేసిన కళ్యాణ్ రామ్, ఈ సారి కాజల్, తమన్నాలతో రొమాన్స్ చేయబోతున్నాడు. వీళ్ళిద్దరూ ఈ రెండు సినిమాలకు ఎంత ప్లస్ అవుతారో చూడాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







