అమెరికా నర్సు జాక్‌పాట్‌ కొట్టేశారు

- August 27, 2017 , by Maagulf
అమెరికా నర్సు  జాక్‌పాట్‌ కొట్టేశారు

 అమెరికాలోని మసాచ్యుసెట్స్‌లో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న మావిస్‌ వాన్‌జిక్‌ (53) జాక్‌పాట్‌ కొట్టేశారు. రూ.4846 కోట్ల పైచిలుకు జాక్‌పాట్‌ను సొంతం చేసుకుని అమెరికా చరిత్రలోనే ఒకే టిక్కెట్‌పై అత్యంత అధికమొత్తాన్ని గెలుచుకున్న వ్యక్తిగా నిలిచారు. బుధవారం డ్రా తీయగా... ఆమెకు జాక్‌పాట్‌ వచ్చినట్లు గురువారం ప్రకటన వెలువడింది. ఇక తాను ఈ ఉద్యోగం చేయబోనంటూ ఆ తర్వాత ప్రకటించేశారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన మావిస్‌ భర్త విలియంను ఇటీవలే కోల్పోయారు. తొమ్మిదినెలల క్రితం బస్సు కోసం నిరీక్షిస్తున్న విలియంను ఓ వాహనం ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు. ఇద్దరు పిల్లల బాధ్యత భుజస్కందాల మీద ఉన్న మావిస్‌ అంతులేని ఆ దుఃఖాన్ని దిగమింగుకుని ఉద్యోగంలో కొనసాగుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com