ఏపీలో జీవో 64 రద్దుకు జనసేన అధ్యక్షుడు పవన్ మద్దతు
- August 29, 2017
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చిన జీవోపై ఇప్పుడు యుద్ధం నడుస్తోంది. అక్రమార్కులను అందలమెక్కిస్తూ, అర్హులైన వారికి అన్యాయం చేస్తున్న జీవో నంబర్ 64 రద్దు కోసం యువత రోడ్డెక్కుతోంది.. టీవీ5 ప్రసారం చేసిన వరుస కథనాలకు విశేష స్పందన వస్తోంది.. విద్యార్థుల ఆందోళనకు జనసేనాని మద్దతు పలకడంతో పొలిటికల్ సెగలు రేగుతున్నాయి. విద్యార్థుల సమస్య పరిష్కరించుకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
ఏపీలో వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్లపై టీవీ5 చేస్తున్న కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అనుమతి లేని యూనివర్సిటీల నుంచి పట్టాలు పొంది, వాటిని అర్హతగా పెట్టి ప్రమోషన్లు పొందుతున్న అధికారుల తీరును ఆధారాలతో సహా బయటపెట్టింది టీవీ5. నకిలీ సర్టిఫికెట్ల వల్ల తాము ఎంతో నష్టపోతున్నామంటూ అగ్రికల్చర్ కాలేజీల్లో విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అక్రమాలకు తెరతీసిన జీవో నంబర్ 64ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 27 రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 16 నంబర్ జీవోను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు హైకోర్టు కూడా ఈ జీవోను సస్పెండ్ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఇంత పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో విద్యార్థులకు అండగా జనసేనాని నిలబడ్డారు.
వ్యవసాయ విద్యార్థుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.. వ్యవసాయ విద్యార్థులను కలిసి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని జనసేనాని ముందు ఏకరవు పెట్టారు. వ్యవసాయ శాఖలో నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందిన వారిని తక్షణం విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.
ఇది కేవలం 3 వేల మంది విద్యార్థుల సమస్య కాదని.. లక్షలాది మంది రైతులు, వాటి కుటుంబాల సమస్యగా తాము భావిస్తున్నామన్నారు. ICAR గుర్తింపు లేని కళాశాలల నుంచి వచ్చిన వారు రైతులకు మెరుగైన సేవలు ఎలా అందించగలుగుతారని ప్రశ్నించారు పవన్. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ పట్టభద్రులకే ఉద్యోగాల నియామకాలకు ప్రాధాన్యం ఇచ్చేలా జీవో 16ను పునరుద్ధరించి.. అనర్హులకు అవకాశం కల్పిస్తున్న జీవో 64ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







