పోలీస్ పాత్రలో రాబోతున్న మాస్ మహరాజా
- August 29, 2017
మాస్ మహరాజా రవితేజ మరోసారి పోలీస్ పాత్రలో నటించనున్నాడు. రవితేజ నటించిన బెంగాల్ టైగర్ తర్వాత దాదాపు రెండేళ్ళ గ్యాప్ వచ్చింది. తనకుతానే ఈ గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఒకే సారి రెండు సినిమాలకు సైన్ చేశారు. రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు టైటిల్స్‌తో రవితేజ కథానాయకుడిగా రెండు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి అనీల్ రావిపూడి, విక్రమ్ సిరికొండ దర్శకత్వం వహిస్తు న్నారు. ఈ చిత్రాల నిర్మాణం చివరిదశలో ఉన్న నేపథ్యంలో రవితేజ మరొక కొత్త చిత్రంలో నటించడానికి అంగీకరించినట్టు తెలిసింది. తమిళంలో విజయవంతమైన బోగన్ అనే చిత్రంలో రవితేజ నటిస్తాడని సోషల్ మీడియాలో వార్తలు హలె చల్ చేస్తున్నాయి. బోగన్ చిత్రంలో జయం రవి హీరోగా నటించాడు. జయం రవి నటించిన తను ఒరువన్ తెలుగులో ధృవగా రీమేక్ అయిన విషయం తెలిసిందే.
బోగన్ చిత్రంలో హీరో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఈ సినిమా గత ఏడాది విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు రవితేజతో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. విక్రమార్కుడు, పవర్ చిత్రా ల్లో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా నటించగా, ఇవి భారీ విజయాన్ని నమోదు చేశాయి. ఇక బోగన్ కథలో కొంత మార్పులు చేసి తెలుగులో నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







