543 మందికి క్షమాభిక్ష

- August 30, 2017 , by Maagulf
543 మందికి క్షమాభిక్ష

వైస్‌ ప్రెసిడెంట్‌, యూఏఈ ప్రైమ్‌ మినిస్టర్‌, దుబాయ్‌ రూలర్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌, 543 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రకటించారు. ఈద్‌ అల్‌ అదా సందర్భంగా ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగింది. దుబాయ్‌ అటార్నీ జనరల్‌ ఇస్సామ్‌ ఇస్సా హుమైదాన్‌ మాట్లాడుతూ, షేక్‌ మొహమ్మద్‌ నిర్ణయం ఖైదీల కుటుంబాల్లో ఆనందం నింపుతుందని చెప్పారు. క్షమాభిక్ష పొందినవారు తిరిగి మంచి జీవనం కొనసాగించాలనీ, బాధ్యత గల పౌరుల్లా మెలగాలని ఆకాంక్షించారాయన. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ అవసరమైన ప్రొసిడ్యూర్స్‌ని ఇప్పటికే ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com