దుబాయ్ లో తెలుగు స్రవంతి వారి 'దసరా దివాళి ధమాకా-2015' వేడుకలు

దుబాయ్లో న్యూ వర్ల్డ్ ప్రైవేట్ స్కూల్ ఆడిటోరియం లో తెలుగు స్రవంతి వారి నిర్వహణలో 'దసరా దివాళి ధమాకా-2015' వేడుకలు ఘనంగా జరిగాయి. రెoడు తెలుగు రాష్ట్రాలకు చెందిన1500 మంది  ప్రజలు పాల్గొన్న ఈ సంబరం ఆడిటోరియంకే నిండుదనం తెచ్చింది.

టాలీవుడ్ కారెక్టర్ నటుడు రావు రమేశ్ గారు, గాన గంధర్వ - గంగాధర శాస్త్రి గారు , ఇంకా అత్తరింటికి దారేదీ, కేరింత సినిమాల్లో నటించిన దానం తేజస్వీలను సంప్రదాయిక పద్ధతిలో కుంకుమ, తాంబులాది సత్కారాలతో స్వాగతించగా, వారు సభాసాదులను హర్షతిరేకాలతో ఆనందింపచేశారు.

ఈ కార్యక్రమం శ్రీమతి మాలా గోపీనాధ్ మరియు  శ్రీమతి హిమబిందు గార్ల ప్రార్ధన ఇంకా యువ కళాకారిణుల 'గణేశ ధీమాహి' భరతనాట్య ప్రదర్శనతో శుభారంభమయింది. సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి రెడ్డి తన అధ్యక్షోపన్యాసంలో, ఆంధ్ర రాజధాని అమరావతి కి విజయదశమి రోజు శంఖుస్థాపన చేసిన సందర్భంగా ప్రభుత్వానికి, ప్రజలకు శుభాభినందనలు తెలియజేశారుతెలుగు స్రవంతి, నేపాల్ ను చెల్లాచెదురు చేసిన భూకంప ఘటన, గాంధీ జయంతి సందర్భంగా సొనాపూర్ లేబర్ కాంపులో ఆహార పొట్లాలను పంచడం వంటి  కార్యక్రమాలతో సమాజసేవలో, స్థానిక ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుందని ఆమె తెలిపారు.  ఉపాధ్యక్షురాలు శ్రీమతి దీపికా కిశోర్ బాబు ఆహ్వానంపై ఆంకర్ అశ్విని మిగిలిన కార్యక్రమాన్ని నడిపించారు.

కూచిపూడి, బాలీవుడ్, హాలీవుడ్ నృత్య ప్రదర్శనలతో హుషారెత్టింది. చిన్నారులు చేసిన అరబిక్ కేన్ డాన్స్, త్తి స్వదేశం కాని స్వదేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు నివాళిగా నిలువగా, శ్రీమతి తాటంభొట్ల ప్రీతి 'కొలువై ఉన్నాడే దేవదేవుడు' కూచిపూడి నృత్య ప్రదర్శన కన్నుల పoడువయింది. ధ్వన్యనుకర ణ చక్రవర్తి, టీవీ 9 కార్యక్రమం 'ఎవడి గోల వాడిదే' ఫేమ్ భవిరి రవి,  రాజకీయనాయకులు మరియు ఏక్టర్ల అనుకరణతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగా, శంకర నారాయణ తన లైవ్ కామెడీ తో చిరునవ్వులు పూయించారు.

సంస్థ తరపున ముఖ్య అతిధి  రావు రమేశ్ ను పట్టు శాలువా, మేమెంటో తో ఘనంగా సత్కరించారు. అనంతరం కిక్కిరిసిన ప్రేక్షకుల కోరిక మేరకు రమేశ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఖలేజా, అత్తరింటికి దారేదీ, కొత్త బంగారు లోకం ఇంకా తన తండ్రి స్వర్గీయ రావు గోపాల రావు బ్రాండ్ మార్క్ 'ముత్యాల ముగ్గు' లోని డైలాగులతో వారిని ఫిదా చేశారు.

అనంతరం కార్యక్రమంలో ఆణిముత్యమైన అంశం - గాన గంధర్వ - గంగాధర శాస్త్రి వారి భాషనంలో భగవద్గీతా సారం, దానిని జీవితానికి అన్వయించుకునే విధానం వివరించి, ఆంగ్లభాష మీద వ్యామోహంతో మాతృభాష తెలుగును నిర్లక్షం చేయవద్దని పిలుపునిచ్చారు. అనంతరం, పాల్గొన్నవారికి ట్రోఫీలు, మెమెన్ టో లతో గౌరవించిన సంస్థ జనరల్ సెక్రటరీ వెంకట్ రెడ్డి గారి కృతజ్ఞతా సమర్పణతో కార్యక్రమం రానున్న మన సంప్రదాయ పండుగలకు మళ్లీ కలుద్డామనే వాగ్దానంతో ముగిసింది.

మిసెస్స్ లక్ష్మి రెడ్డి(ప్రెసిడెంట్),మిసెస్స్ దీపిక కిషోర్ బాబు(వైస్ ప్రెసిడెంట్),వెంకట్ రెడ్డి(జనరల్ సెక్రటరీ) ,జి.సుధాకర్ రావు(జాయింట్ సెక్రటరీ),కె.సుబ్బా రెడ్డి(జాయింట్ సెక్రటరీ),మిసెస్స్ మాలా గోపీనాథ్(కల్చురల్ సెక్రటరీ),మిసెస్స్ లతా నగేష్(కల్చురల్ సెక్రటరీ),మిసెస్స్ లక్ష్మి పన్యాల(త్రెశరర్) మిస్టర్ రాజేష్ కుమార్(ఈవెంట్స్ సెక్రటరీ) మరియు కమిటీ మెంబర్లు మిస్టర్ నాగార్జున రావు,మిస్టర్ అనిల్ గురానా,మిస్టర్ ప్రసాద్ పెండ్యాల వారిచే చిన్నారులకు ట్రోఫీలు అందచేయబడినవి.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుగు స్రవంతి వారికి మాగల్ఫ్.కామ్ తరపున ప్రత్యేక అభినందనలు.

 

--సి.శ్రీ(దుబాయ్)

4

Back to Top