తిరుపతికి చెందిన చిచ్చరపిడుగు గిన్నీస్‌ బుక్‌‌లో చోటు కోసం లింబో స్కేటర్ దేవిశ్రీప్రసాద్‌ఫీ

- August 30, 2017 , by Maagulf
తిరుపతికి చెందిన చిచ్చరపిడుగు గిన్నీస్‌ బుక్‌‌లో చోటు కోసం లింబో స్కేటర్ దేవిశ్రీప్రసాద్‌ఫీ

తిరుపతికి చెందిన 10 సంవత్సరాల బాలుడు ఈ నెల 31 వ తేదీన గిన్నీస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం కొన్ని ఫీట్లు చేయనున్నాడు. గుంటూరు నగర శివారులో  ఆచార్యనాగార్జున యూనివర్సిటీ పక్కన ఉన్న రామకృష్ణ హౌసింగ్‌ వెంచర్‌ ఈఫీట్స్‌ కు వేదిక కానుంది. తిరుపతికి చెందిన దేవిశ్రీ ప్రసాద్‌ రోలర్‌ స్కేటింగ్‌ లో నిష్ణాతుడిగా పేరుతెచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో.. లింబో స్కేటింగ్‌లో పరికొత్త రికార్డులు సృష్టించి ప్రపంచ రికార్డును సాధించేందుకు దేవిశ్రీ ప్రసాద్‌ సమాయత్తమవుతున్నాడు. 
ఇతనికి రాష్ట్ర ప్రభుత్వం17 లక్షలు కేటాయించింది. పలు ప్రైవేటు వ్యాపార సంస్థలు దేవిశ్రీ ప్రసాద్‌ ఇచ్చే ప్రదర్శకు అవసరమైన వనరులను సమకూర్చాయి.  31వతేదీన జరుగనున్న ఈ ఫీట్స్‌ ప్రధర్శనను పరిశీలించేందుకు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ తరపున ఓ న్యాయ నిర్ణేత విచ్చేయనున్నారు. ప్రభుత్వ సహకారంతో తాను గిన్నీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌లో స్తానం సంపాదిస్తానని దేవిశ్రీప్రసాద్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com