సౌదీ మసీదు దుర్ఘటనలో 12 మందికి గాయాలు ఒకరి మృతి
- October 27, 2015
దక్షణ సౌదీ అరబియా ప్రాంతం, నజాన్ లోని షియా మసీదులో ఒక భక్తుని మృతికి, పలువురు గాయాల పాలవడానికి కారణమైన ఆత్మాహుతి బాంబు దాడికి తామే బాధ్యులుగా ఉగ్రవాద ముఠా ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్.) ప్రకటించుకుంది. ఈ సంస్థ, సౌదీ అరబియా లో ఉండే మినారిటీ తెగ ఐన ఇస్మైలీ షియైతీ ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపినట్టు ప్రకటించింది. ఈ గ్రూపు, అరబ్ ద్వీపకల్పంలోని పరిపాలకులపై తిరుగుబాటు లేవదీసి, సౌదీ లోని సున్నీ యువతను షియైతీ ల వంటి లక్ష్యాలపై దాడిచేయవలసిందిగా ప్రోత్సహిస్తోంది. ఈ ఘటనా స్థలంలో దొరికిన ఒక తీవ్రవాది తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో, ఈ దాడి చేయడానికి నిర్ణయించుకున్నట్టు నిరూపణ అయిందని ఆంతరంగిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా అల్ మాష్హాడ్ మసీదులో సాయంకాల ప్రార్ధనలు ముగించుకొని ప్రజలు బయలుదేరుతుండగా దాడి జరిగిందని అక్కడి స్థానిక ప్రజలు తెలియజేశారు.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







