గల్ఫ్ ఎకనమిక్ ఫోరం ను ప్రారంభించిన కతార్ ప్రధాని

- October 27, 2015 , by Maagulf
గల్ఫ్ ఎకనమిక్ ఫోరం ను ప్రారంభించిన కతార్ ప్రధాని

మొట్ట మొదటి గల్ఫ్ ఎకనామిక్ ఫోరం ను , కతార్ ప్రధానమంత్రి మరియు ఆంతరంగిక శాఖా మంత్రి  హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ న్యాసర్ బిన్ ఖలీఫా అల్ థాని, నిన్న దోహా షెరటాన్ హోటెల్ లో ప్రారంభించారు. కతార్  చాంబర్ వారి సహకారంతో ఫెడరేషన్ ఆఫ్ జి. సి. సి. చాంబర్స్ వారిచే ఏర్పాటుచేయబడిన ఈ ఫోరమ్ లో,  హిజ్ హైనెస్ ఎమిర్ వారి తరపున సభ్యులకు స్వాగతం చెబుతూ, ఈ ఫోరమ్ విజయవంతం కావాలనే ఆయన ఆకాంక్షను తెలియజేశారు. దృఢమైన మరియు సమతుల ఆర్ధికవ్యవస్థ, ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల నిజమైన భాగస్వామ్యoతోనే సాధ్యమవుతుందని అన్నారు. కతార్, తన ఆర్ధికరంగాన్ని కేవలం ముఖ్య శక్తివనరులపై ఆధారపడి మాత్రమే కాకుండా, వివిధ జాతీయ వనరుల మూలాలపై నిర్మించాలని ఆయన అభిప్రాయపడ్డారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com