హైదరాబాద్ లో ఈ నెల 5న గణేష్ నిమజ్జనం.. జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు
- August 31, 2017
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 5.. అనంత చతుర్ధశి రోజున నిమజ్జనం జరుగుతుందని జీహెచ్ఎంసీ , భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది. గత ఏడాదిలానే.. ఈసారి కూడా ఖైరతాబాద్ మహా గణపతిని అదే రోజు మధ్యాహ్నం కల్లా నిమజ్జనo పూర్తి చేస్తామని తెలిపింది.
హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది జీహెచ్ఎంసీ. అందులో భాగంగా గ్రేటర్ పరిధిలో కొలువై ఉన్న గణేష్ మండప ఉత్సవ కమిటీలతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్. శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటి పలు సూచనలు చేసింది.
సెప్టెంబర్ 5న హుస్సేన్‌సాగర్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం సాఫీగా జరగడానికి ట్యాంక్ బండ్ దగ్గర 38 భారీ క్రేన్లను, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపట్టనుంది జీహెచ్ఎంసీ. వినాయక నిమజ్జన శోభా యాత్ర గ్రేటర్ హైదరాబాద్ పరిదిలో దాదాపు 354 కిలోమీటర్ల మేర సాగనుంది. అందుకోసం బల్దియా పరిదిలో 168 గణేష్ నిమజ్జనం యాక్షన్ టీం లు...10 వేల మంది శానిటేషన్ కార్మికులు.. 295మంది జవాన్లు... 688 SFA లు పనిచేస్తారని కమిషనర్ తెలిపారు.
మరోవైపు ఎక్కడికక్కడ వినాయక నిమజ్జనం చేయడానికి గత ఏడాది మొదలు పెట్టిన బేబీ పాండ్స్ నిమజ్జన కొలనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నారు. పూర్తైన వాటిలో సాధ్యం అయినంత మేర నీటిని నింపాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలిచ్చారు మేయర్ బొంతు రామ్మోహన్.
అటు.. ఎల్బీ నగర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు మెట్రో రైలు పనుల వల్ల.. రోడ్లు పాడై పోయాయని.. చాల చోట్ల గుంతలు ఉండటంతో శోభా యాత్ర ఆలస్యం అవుతుందని భాగ్యనగర్ ఉత్సవ సమితి.. మేయర్, కమిషనర్ దృష్టికి తెచ్చింది. దాదాపు 60 శాతం శోభాయాత్ర మెట్రో మార్గాల్లో ఉన్నందున తగు చర్యలు తీసుకోవాలని కోరింది. కీలకమైన ఈ సమీక్షా సమావేశంలో మెట్రో రైల్ అధికారులు హాజరుకు కాకపోవడంపై అటు భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితితో పాటు.. మేయర్ అసంతృప్తి వ్యక్తం చేసారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







