నారారోహిత్ చేతులమీదుగా "పెంపక్" టీజర్ విడుదల
- September 01, 2017
థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురాం రొయ్యూరుతో కలిసి స్వీయదర్శకత్వంలో గోవర్ధన్ నిర్మిస్తున్న చిత్రం "పెంపక్" (ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం). చంద్రకాంత్, రాధికా మెహరోత్రా, పల్లవి డోరాలు హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని నోబుల్‌స్టార్ నారారోహిత్ విడుదలచేసి, చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని.. సినిమా మంచి హిట్టవ్వాలని కోరుకుంటున్నానని నారారోహిత్ అన్నారు. చిన్నచిత్రం అయినప్పటికీ టీజర్ చిత్రటీజర్ ఎంతో ఆకర్షిస్తోంది.
ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆడియో విడుదల జరుపుకోనున్న "పెంపక్" ఫస్ట్ సింగిల్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్ విడుదల చేయగా.. రెండో పాటను మరో ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేశారు. మూడో పాటను బిగ్‌ఎఫ్‌ఎంలో లాంచ్ చేశారు.
తమచిత్రం టీజర్ నారారోహిత్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని.. తమందరికీ ఈ చిత్రం మంచి లైఫ్ ఇస్తుందనే నమ్మకం ఉందని దర్శక నిర్మాత గోవర్ధన్, హీరో చంద్రకాంత్, హీరోయిన్స్ రాధికా మెహరోత్రా, పల్లవి డోరా అన్నారు. ఈ వారంలో ఆడియో రిలీజ్ చేసి, సెప్టెంబర్ 15న తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!









