సుధీర్ బాబు తో సినిమాకు రెడీ అవుతున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ

- September 03, 2017 , by Maagulf
సుధీర్ బాబు తో సినిమాకు రెడీ అవుతున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ

ఇంద్రగంటి మోహన్ కృష్ణ షాకుల మీద షాకులు ఇస్తున్నాడు. థ్రిల్లింగ్ హిట్ జెంటిల్ మెన్ తర్వాత అమీతుమీ అంటూ కామెడీ మూవీ చేసి ఆశ్చర్యపరిచిన ఇంద్రగంటి, ఇప్పుడు తన నెక్ట్స్ మూవీతో సర్ ప్రైజ్ ఇస్తున్నాడు. టాలీవుడ్ లో ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చెయ్యని హీరోతో కలిసి సినిమా చెయ్యబోతున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చెయ్యని విధంగా సెపరేట్ ట్రాక్ లో వెళ్తున్నాడు. ఒకదానితో ఒకటి సంబంధం లేని కథలను డైరెక్ట్ చేస్తోన్న ఇంద్రగంటి తన నెక్ట్స్ మూవీని కూడా ఇలాగే ప్లాన్ చేశాడు. నానిని డ్యుయల్ రోల్ లో ప్రజెంట్ చేసి జెంటిల్ మెన్ తో థ్రిల్లింగ్ హిట్ కొట్టిన ఇంద్రగంటి ఆ తర్వాత లో బడ్జెట్ లో అమీతుమీ అనే కామెడీ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈసినిమా హిలేరియస్ గా నవ్వించి సూపర్ హిట్ కొట్టింది. కామెడీ మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్న ఇంద్రగంటి ఇప్పుడు సుధీర్ బాబుతో సినిమా చెయ్యబోతున్నాడు. ఈసినిమా కూడా ఓ వైవిధ్యమైన స్టోరీతోనే తెరకెక్కుతుందట. భలేమంచిరోజు తర్వాత ఓ సూపర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తోన్న సుధీర్ బాబు ఈసబ్జెక్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. త్వరలోనే ఈసినిమా స్టార్ట్ కాబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com