వన్డేల్లో ప్రపంచ రికార్డుని నెలకొల్పిన ధోని

- September 03, 2017 , by Maagulf
వన్డేల్లో ప్రపంచ రికార్డుని నెలకొల్పిన ధోని

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వన్డే చరిత్రలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో 100 స్టంపౌట్స్ చేసిన ఏకైక వికెట్‌ కీపర్‌గా నిలిచాడు. శ్రీలంకతో ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్ ధనంజయని స్టంపౌట్ చేయడం ద్వారా ధోని ఈ రికార్డు అందుకున్నాడు.
ఈ సిరీస్‌లోనే 99 స్టంపౌట్స్‌తో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కరని సమం చేసిన ధోని, తాజాగా స్టంపింగ్‌తో అతడి రికార్డుని అధిగమించాడు. లంక ఇన్నింగ్స్ లో భాగంగా 45 ఓవర్ చివరి బంతికి దనంజయను ధోని స్టంపింగ్ చేశాడు. చాహల్ బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వచ్చి షాట్ కోసం ధనంజయ ప్రయత్నించాడు.
అనూహ్యంగా టర్న్ తీసుకున్న బంతి నేరుగా ధోని చేతుల్లోకి వెళ్లింది. క్షణాల వ్యవధిలోనే ధోని వికెట్లను గీరాటేయడంతో అతని ఖాతాలో వంద స్టంపౌట్స్ చేరాయి. 2004, డిసెంబరు 23న వన్డేల్లోకి అరంగేట్రం చేసిన మహేంద్రసింగ్ ధోని తన కెరీర్‌లో ప్రస్తుతం 301వ వన్డే ఆడుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com