భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు
- September 03, 2017
చైనా వేదికగా జరుగుతున్న బ్రిక్స్ దేశాల సమావేశం ప్రారంభమైంది. సోమవారం ఉదయం జియామెన్ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ సెంటర్‌కు వెళ్లిన ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఘన స్వాగతం పలికారు. సమావేశానికి ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు మైకెల్ టెమర్ సహా బ్రిక్స్ దేశాధినేతలంతా కలిసి గ్రూఫ్ ఫోటో దిగారు. కాగా బిక్స్ సమావేశాల సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షుడు టెమర్‌తో ప్రధాని మోదీ విడివిడిగా సమావేశమై దైత్య చర్చలు జరపనున్నారు. వీరితో పాటు చైనా అధ్యక్షుడితోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నట్టు సమాచారం. చైనా, భారత భద్రతా దళాల మధ్య డోక్లాం వద్ద దాదాపు రెండున్నర నెలల పాటు కొనసాగిన ప్రతిష్టంభనకు తెరపడిన కొద్ది రోజులకే ఇరు దేశాధినేతలు సమావేశం కానుండడంపై విశేష ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్‌బైజాన్‌లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









