ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో తప్పిన ముప్పు
- September 04, 2017
ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. కోచి విమానాశ్రయంలో అబుదాబి-కోచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఒక పక్కకు ఒరిగిపోయింది. మంగళవారం తెల్లవారుజామున 2.39 గంటలకు చేరుకున్న విమానం అకస్మాత్తుగా ప్రమాదానికి గురికావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కొచ్చి విమానాశ్రాయానికి చేరుకున్న బోయింగ్ 737-800 విమానం ఎయిర్ పోర్టులోని టాక్సీవేనుంచి పార్కింగ్ వే వైపు దూసుకుపోయింది. దీంతో ముంగు బాగం బాగా దెబ్బతింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని కోచిన్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్(సీఐఏఎల్) అధికార ప్రతినిధి తెలిపారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది.
ఈ ప్రమాదంపై అంతర్గత విచారణ, అలాగే డిఐజిసి ఏవియేషన్ రెగ్యులేటర్ దర్యాప్తును ప్రారంభించామని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించేందుకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి అందుబాటులో లేరు.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్‌లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్‌లో పేమెంట్స్..!!









