ఆధార్ కార్డు సెంటర్లను తెరవండి; లేదా ఫైన్ కట్టాల్సిందే
- September 05, 2017
ఆధార్ కార్డును అన్నింటికీ ఆధారం చేస్తూ వెళ్తున్న కేంద్రప్రభుత్వం, ఆధార్ కార్డును తీసుకోని వారికి ప్రత్యేకంగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను కూడా ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకులు తమ 10 శాతం బ్రాంచుల వద్ద ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను ఏర్పాటుచేయడానికి యూఐడీఏఐ మరో నెల పాటు సమయమిచ్చింది. అంటే 100 బ్రాంచులున్న బ్యాంకు 10 బ్రాంచుల వద్ద ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సౌకర్యం కల్పించాలి. సెప్టెంబర్ 30 తర్వాత తాము ఆదేశించినట్టు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లను తెరవకపోతే, ఒక్కో బ్రాంచుకు రూ.20వేల జరిమానా విధించనున్నట్టు యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే చెప్పారు. జూలైలోనే ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్లు తెరవాలంటూ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులను యూఐడీఏఐ ఆదేశించింది. ప్రతి 10 బ్రాంచుల్లో ఒక దాని దగ్గర ఆగస్టులోపు ఈ సౌకర్యం కల్పించాలని పేర్కొంది. ఈ సమయం ముగియడంతో, మరో నెల పాటు సమయమివ్వాలని చాలా బ్యాంకులు యూఐడీఏఐని కోరాయి.
ఈ నేపథ్యంలో మరో నెలపాటు బ్యాంకులకు సమయమిచ్చింది. గడువు ముగిసేలోపల ఈ సౌకర్యం ఏర్పాటుచేయకపోతే, ఒక్కో బ్రాంచుకు ఒక్కో నెలలో రూ.20వేల జరిమానా విధించనున్నట్టు యూఐడీఏఐ హెచ్చరించింది. బ్యాంకు అకౌంట్లు ప్రారంభించడానికి, రూ.50వేలు లేదా ఆపై ఆర్థిక లావాదేవీలు జరుపడానికి ప్రస్తుతం ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రస్తుత బ్యాంకు అకౌంట్ హోల్డర్స్ కూడా 2017 డిసెంబర్ 31 వరకు తమ ఆధార్ నెంబర్‌ను బ్యాంకు అకౌంట్‌తో అనుసంధానం చేసుకోవాలి. ఇలా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సౌకర్యం బ్రాంచుల వద్ద ఏర్పాటుచేయడంతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనాల్సినవసరం ఉండదని పాండే చెప్పారు.
తాజా వార్తలు
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!









