హరికేన్ హార్వీ కారణంగా టెక్సాస్‌కు పర్యావరణ ముప్పు
- September 05, 2017
హరికేన్ హార్వీ సృష్టించిన అలజడికి కకావికలమైన అమెరికా రాష్ట్రం టెక్సాస్‌కు ఇప్పుడు పర్యావరణ ముప్పు పొంచిఉంది. హరికేన్ హార్వీ బీభత్సంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. మొత్తంగా అమెరికా అర్థిక వ్యవస్థకు హార్వీ కారణంగా సుమారు రూ.11.54 లక్షల కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా. కాగా, హరికేన్ హార్వీ వల్ల సంభవించిన పర్యవరణ మార్పులతో అంటువ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.
సురక్షిత ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు చేరుకున్న ప్రజలు బాటిల్ వాటర్‌నే తాగాలని, సర్జికల్ మాస్క్‌లు, కాలివేళ్లను మూసి ఉంచే షూస్, చేతి తొడుగులను వినియోగించాలని సూచించారు. కరీబియన్ దీవుల వైపుగా హరికేన్ ఇర్మా దూసుకువస్తోందని అమెరికా వాతావరణ విభా గం హెచ్చరించింది. కేటగిరి 4 తీవ్రత గల ఈ హరికేన్ ప్రభావం ప్యూర్టోరికో, ఫ్లోరిడా, కరీబియన్ దీవులపై ఎక్కువ ఉంటుందని, గంటకు 240 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యగా పలు విమాన సర్వీసులను రద్దు చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







