కొత్త రక్తం, కొత్త ఆలోచనలే కీలకం
- September 06, 2017
యుఏఈ: వైస్ ప్రెసిడెంట్, ఐమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, తన కార్యాలయంలో క్రియేటివ్ మీటింగ్ సందర్భంగా, కొత్త రక్తం సరికొత్త ఆలోచనలతో వచ్చినప్పుడే అభివృద్ధి మరింత వేగవంతమవుతుందనీ, నూతన ఆవిష్కరణలకు ఆస్కారమేర్పడుతుందని చెప్పారు. యువతే సరికొత్త ఆవిష్కరణలకు మార్గనిర్దేశకులని ఆయన కొనియాడారు. ప్రపంచం అత్యంత వేగంగా టెక్నాలజీ సహా అనేక రంగాల్లో పురోగమిస్తోందనీ, యువత మెరుగైన అవకాశాల్ని అందిపుచ్చుకోవడంతోపాటు, కొత్త కొత్త ఆవిష్కరణలతో సత్తా చాటవలసి ఉందని, వారిని ఆ వైపుగా ప్రోత్సహించడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో పలు విభాగాలు దేశాభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారాయన. భవిష్యత్తులో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులు, ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు దేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళతాయని వివరించారు. అభివృద్ధి, ఆవిష్కరణలు, సంక్షేమం దేశ ప్రగతిని నిర్దేశిస్తాయని చెప్పారు షేక్ మొహమ్మద్.
తాజా వార్తలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..







