అర్జున్ రెడ్డి తో సినిమాకి నో చూపిన లావణ్య
- September 06, 2017
అందాలరాక్షసి లావణ్య త్రిపాఠికి ఈ ఏడాది లక్ కుదర్లేదు. మిస్టర్, రాధ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఇక ఆశలన్నీ 'యుద్ధం శరణం' మీదే ఉన్నాయి. రామ్‌తో 'ఉన్నది ఒక్కటే జిందగీ' చేస్తోంది ఆమె. అర్జున్‌రెడ్డితో ఫుల్ఫామ్లోవున్న విజయ్ హీరోగా పరశురామ్ డైరెక్షన్లో గీతా ఆర్ట్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ ప్రాజెక్టుకు ముందుగా కమిటయిన లావణ్య, ఇప్పుడా మూవీ చేయలేనని తప్పుకుందట. ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి కారణాలు లేకపోలేదు. ముందుగా చెప్పిన కథలో తన రోల్ తగ్గించి అర్జున్‌రెడ్డి హిట్‌తో విజయ్ రోల్‌కు ఎక్కువగా ప్రయార్టీ ఇవ్వడమే రీజన్ అని తెలుస్తోంది. జనరల్‌గా రేస్‌లోవున్న హీరో కాంబో వదిలేయడం ఆషామాషీ కాదు.. మరి లావణ్య లక్ ఎలా ఉండబోతుందో! మరోవైపు లావణ్య ప్లేస్‌లో శాండిల్‌వుడ్ బ్యూటీ రష్మికను తీసుకున్నారు. గతేడాది కన్నడలో 'కిరిక్ పార్టీ' మూవీతో పాపులర్ అయ్యింది ఈ సుందరి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







