లావ్‌ర్‌ అబుదాబీ ప్రారంభానికి సిద్ధం

- September 06, 2017 , by Maagulf
లావ్‌ర్‌ అబుదాబీ ప్రారంభానికి సిద్ధం

యూఏఈ: ఐకానిక్‌ లావ్‌ర్‌ అబుదాబీ మ్యూజియం, నవంబర్‌ 11న ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. సాదియాత్‌ ఐలాండ్‌లో ఈ మ్యూజియంను ఏర్పాటు చేశారు. అబుదాబీ టూరిజం మరియు కల్చర్‌ అథారిటీ ఛైర్మన్‌, ఛైర్మన్‌ ఆఫ్‌ ది టూరిజం డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ మొహమ్మద్‌ ఖలీఫా అల్‌ ముబారక్‌ మాట్లాడుతూ, ఈ మ్యూజియం ఓ కొత్త ప్రపంచంలా ఉంటుందని చెప్పారు. 2007లో ఫ్రాన్స్‌, అబుదాబీ మధ్య కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ఈ మ్యూజియం రూపుదిద్దుకుంది. 97,000 చదరపు మీటర్ల వైశాల్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్‌ ఆర్కిటెక్ట్‌ జీన్‌ నోవెల్‌ ఈ కాన్సెప్ట్‌ని డిజైన్‌ చేశారు. 8 లేయర్లతో 180 మీటర్ల వెడల్పుగల డోమ్‌ మొత్తం మ్యూజియంని కవర్‌ చేస్తుంది. ఆర్ట్‌ గ్యాలరీలతోపాటు, టెంపరరీ ఎగ్జిబిషన్‌ స్పేస్‌, చిల్డ్రన్స్‌ మ్యూజియం, 200 సీటర్‌ ఆడిటోరియం, రెస్టారెంట్‌, కేఫ్‌, రిటైల్‌ స్పేస్‌ కూడా ఇందులో ఉంటాయి. ఈ మ్యూజియంలోకి వెళ్ళాలంటే పెద్దలు 60 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. 13 ఏళ్ళలోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. విద్యార్థులకు, ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, సీనియర్‌ సిటిజన్స్‌కి సంబంధించి ప్రత్యేకమైన ఆఫర్లు త్వరలో వెల్లడిస్తారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com