హ్యాకింగ్‌: 1.8 మిలియన్‌ దిర్హామ్‌ల ట్రాన్స్‌ఫర్‌

- September 06, 2017 , by Maagulf
హ్యాకింగ్‌: 1.8 మిలియన్‌ దిర్హామ్‌ల ట్రాన్స్‌ఫర్‌

దుబాయ్‌: ఓ హ్యాకర్‌, అమెరికాకి చెందిన ఓ వ్యక్తి బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి, దుబాయ్‌లోని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీకి పెద్ద మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్‌ చేయడం జరిగింది. 2013 మార్చిలో సీటెల్‌లోని బ్యాంక్‌ అకౌంట్‌ని హ్యాక్‌ చేసి, 500,000 డాలర్లు (1.3 మిలియన్‌ దిర్హామ్‌లు) మూడు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో కంపెనీకి చెందిన బ్యాంక్‌ అకౌంట్‌కి మళ్ళించినట్లు అధికారులు గుర్తించారు. హ్యాకింగ్‌ని గుర్తించిన అమెరికన్‌, సదరు సంస్థను సంప్రదించి ఆ మొత్తాన్ని తిరిగి తన అకౌంట్‌కి బదలాయించాల్సిందిగా కోరినా, ఆ కంపెనీ అందుకు సమ్మతించలేదు. దాంతో ఆ అమెరికన్‌, లీగల్‌ కన్సల్టెంట్‌ని ఆశ్రయించారు. లీగల్‌ కన్సల్టెంట్‌ హస్సన్‌ ఎల్హాఆయిస్‌ సివిల్‌ కేస్‌ వేస్తూ, కంపెనీపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం, 250,000 డాలర్లను బాదితుడికి చెల్లించాల్సిందిగా కంపెనీకి ఆదేశించింది. అలాగే 9 శాతం వడ్డీ చెల్లించాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com