సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిన కన్నడ నటి రష్మిక మందన
- September 06, 2017
కిరాక్ పార్టీతో శాండల్ వుడ్ ను ప్రేమలో పడేసి, సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిన రష్మిక మందన టాలీవుడ్ లోనూ బిజీ అవుతోంది. ఇన్నోసెంట్ లుక్స్ తో తెలుగు కుర్రాళ్లను పడేసి టీటౌన్ లోనూ స్టార్ హీరోయిన్ గా మారబోతోంది. ఇప్పుడో క్రేజీ మెగాప్రాజెక్ట్ లో హీరోయిన్ గా సెలక్ట్ అయి టాప్ రేసులో స్పీడ్ పెంచుతోంది.
కిరిక్ పార్టీతో రష్మిక మందన శాండల్ వుడ్ కు న్యూ డ్రీమ్ గాళ్ గా మారిపోయింది. ఈ సినిమాలో రష్మిక పెర్ఫామన్స్ కు ఫ్లాట్ అయిన సౌత్ మేకర్స్ ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ ఇస్తున్నారు. తెలుగు,తమిళ్ లో క్రేజీ స్క్రిప్టులు రష్మికా దగ్గరకు వెళ్తున్నాయి. ఆల్రెడీ తెలుగులో నాగశౌర్యతో ఓ సినిమా చెయ్యబోతోంది రష్మిక. న్యూ కమర్ వెంకీ దర్శకత్వంలో శౌర్య చేస్తోన్న రొమాంటిక్ ఎంటర్టైనర్ లో రష్మికా హీరోయిన్ గా చేస్తోంది.
ఈసినిమాతో పాటు విజయ్ దేవరకొండ-పరశురామ్ కాంబినేషన్ లో రాబోతోన్న సినిమాలోనూ హీరోయిన్ గా చెయ్యబోతంది. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA2 బ్యానర్ లో విజయ్ చేస్తోన్న సినిమాలో రష్మికా హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. ఇంతకుముందు ఈసినిమాలో లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ పర్సనల్ ఇష్యూస్ తో లావణ్య ఈసినిమా నుంచి తప్పుకోవడంతో, రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక రష్మిక మెగాబ్యానర్ లో అడుగుపెట్టిందంటే ఈ బ్యూటీ కెరీర్ స్పీడ్ ట్రాక్ ఎక్కుతోందని చెప్పొచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







