హైదరాబాద్ లో వెలిసిన అతిపెద్ద అమెజాన్ సెంటర్

- September 07, 2017 , by Maagulf
హైదరాబాద్ లో వెలిసిన అతిపెద్ద అమెజాన్ సెంటర్

హైదరాబాద్: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లో తన కార్యకలాపాలను భారీగా విస్తరిస్తోంది. భారతదేశపు అతిపెద్ద ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ను నేడు నగరంలో ప్రారంభించింది. 1.3 మిలియన్‌ చదరపు అడుగుల స్పేస్‌/1.6 కిలోమీటర్ల కన్వేయర్‌ బెల్ట్‌లో శంషాబాద్‌లో దీన్ని ఏర్పాటుచేసింది. అమెజాన్‌ నేడు లాంచ్‌ చేసిన ఈ సెంటర్‌పై రాష్ట్ర ఐటీ శాఖ, పరిశ్రమల శాఖా మంత్రి కే. తారకరామారావు ఆనందం వ్యక్తంచేశారు. నగరంలో దీన్ని ఏర్పాటుచేసినందుకు అభినందనలు తెలిపారు.
 
తెలంగాణలో ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ ఏర్పాటుచేయడంతో, వేలమంది చిన్న, మధ్య తరహా వ్యాపారులు స్థానికంగా తయారుచేసిన ఉత్పత్తులను దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విక్రయించుకునే వీలవుతుందన్నారు. ప్యాకేజింగ్‌, రవాణా, లాజిస్టిక్స్‌, హాస్పిటాలిటి వంటి సహాయక వ్యాపారాలు వృద్ది చెందుతాయన్నారు. ఈ సెంటర్‌ ద్వారా అమెజాన్‌ తన స్టోరేజ్‌ సామర్థ్యాన్ని 3.2 మిలియన్‌ క్యూబిట్‌ ఫీటుకు పెంచుకుంది. దీంతో వినియోగదారులకు త్వరితగతిన సరుకులను అందజేయనుంది. యువతకు వేలకొద్దీ ఉద్యోగవకాశాలను కూడా ఈ ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్‌ సృష్టించనుందని అమెజాన్‌ ఇండియా, కస్టమర్‌ ఫుల్‌ఫిల్మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అఖిల్‌ సక్సేనా తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com