'ఛేజ్ మాస్టర్' బిరుదు అందుకున్న కోహ్లీ
- September 07, 2017
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి తాజాగా ఓ బిరుదు ఇచ్చింది. 'ఛేజ్ మాస్టర్' అంటూ కొనియాడింది. బుధవారం శ్రీలంకతో జరిగిన టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా.. ఛేజ్ మాస్టర్ కోహ్లీ 82 పరుగుల ఇన్నింగ్స్‌తో టీమిండియా 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది.. అని ఐసీసీ పేర్కొంది.
నిజానికి కోహ్లీకి ఛేజింగ్ అంటేనే ఇష్టం. లక్ష్య ఛేదనలో ముందుండే కోహ్లీ తాజాగా శ్రీలంకతో జరిగిన అన్ని ఫార్మాట్లలోనూ ఇదే ఫార్ములాను ఎంచుకున్నాడు. ప్రత్యర్థులకు బ్యాటింగ్ అప్పగించి, అనంతరం వారు నిర్దేశించిన లక్ష్యాలను ఛేదించడంలో కోహ్లీ దిట్ట అనిపించుకున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ సాధించిన పరుగుల్లో ఎక్కువ శాతం ఛేదనలో వచ్చినవే. ఇక టీ20లలో కోహ్లీ ఏకంగా ఛేజింగ్‌లో 1,016 పరుగులు పిండుకోవడం విశేషం. ఇక ఇప్పటికే కోహ్లీని అభిమానులు చీకూ అని, ఇండియన్ రన్ మిషన్ అని, పరుగుల వీరుడని పిలిచుకుంటుంటారు.. ఇప్పుడు ఛేజ్ మాస్టర్ బిరుదు కూడా వచ్చి చేరింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









