ఫ్రీ మెడికల్ క్యాంప్‌ని నిర్వహించిన పిడబ్ల్యుఎస్
- September 07, 2017
జెడ్డా: పాకిస్తాన్ వెల్ఫేర్ సొసైటీ, శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పాకిస్తాన్ కాన్సులేట్‌లోని కమ్యూనిటీ హాల్‌లో ఉచిత మెడికల్ క్యాంప్‌ని నిర్వహించనుంది. వెస్టర్న్ ప్రావిన్స్‌లో పాకిస్తానీ వలసదారులు ఈ సోషల్ మరియు వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌ని ఏర్పాటు చేశారు. ఉచిత మెడికల్ క్యాంప్, అలాగే ఐ క్లినిక్‌ని కూడా నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఇన్‌ఛార్జ్ మొహమ్మద్ అబ్దుల్ సత్తార్ యూనస్ మాట్లాడుతూ, మెడికల్ క్యాంప్‌లో స్పెషలిస్ట్ డాక్టర్లు ఉంటారనీ, పేషెంట్లకు ఉచితంగా మందులు అందజేస్తారని చెప్పారు. అల్ట్రా సౌండ్, ఎకో పరీక్షల్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు. రక్త పరీక్షలు కూడా ఉచితంగానే ఈ క్యాంప్‌లో చేస్తారు. పిడబ్ల్యుఎస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఖలీల్ ఉర్ రెహ్మాన్ మాట్లాడుతూ, ఉపయోగం లేని, ఎక్స్‌పైరీ డేట్ పూర్తి కాని మెడిసిన్స్‌ని పిడబ్ల్యుఎస్ క్యాంప్‌కి డొనేట్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









