దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం
- September 07, 2017దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.0గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. మెక్సికో తీరంలోని ట్రెస్పికోకు 119 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభించింది. పిజిజియాపన్కు 123 కిలోమీటర్ల దూరంలో సముద్రగర్భంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత శక్తిమంతమైన ప్రకంపనలు రావడంతో మెక్సికో సిటీలోని భవనాలు బీటలు వారాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. దాదాపు 90 సెకండ్ల పాటు భవనాలు కంపించాయని స్థానికులు చెబుతున్నారు. భూకంపం కారణంగా ఎనిమిది దేశాలకు సునామీ హెచ్చరికలను జారీచేసినట్లు యూఎస్ వాతావరణ అధికారులు వెల్లడించారు. మెక్సికో, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్, కోస్టారికా, నిఖరాగ్వా, పనామా, హోండూరస్, ఈక్వెడార్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు