చెత్తా చెదారాలను రోడ్లపై విసిరే డ్రైవర్లకు రస్ అల్ ఖైమాలో భారీ జరిమానాలు సిద్ధం
- September 08, 2017
రస్ అల్ ఖైమా: వాహనాలను నడిపే సమయంలో వాహనదారులు, ప్రయాణీకులు ఎవరైతే రోడ్లపైకి చెత్తా చెదారాలను పారవేస్తారో వారికి కొత్త ట్రాఫిక్ రెగ్యులేషన్ విధాన ప్రకారం 1,000 ధిర్హాం ల జరిమానా విధించదమే కాక సంబంధిత డ్రైవర్ లైసెన్స్ పై ఆరు నల్లని చుక్కలు చేర్చనున్నట్లు రస్ అల్ ఖైయామా పోలీసులు చెప్పారు. రస్ అల్ ఖైమా పోలీసుల ట్రాఫిక్ మరియు గస్తీ శాఖ సాధారణ సేవల శాఖ సమావేశం తర్వాత ఈ విషయాన్నీ వెల్లడించారు.ఈ ఏడాది ప్రారంభంలో తమ తమ కారుల నుంచి సిగరెట్ పెట్టెలను రోడ్డుపైకి విసిరివేస్తూ పలువురు వాహనదారులు పోలీసులకు పట్టుబడ్డారు. దాంతో దుబాయ్ పోలీసులు వారికి 1,000 ధిర్హాం ల జరిమానా విధించదమే కాక సంబంధిత డ్రైవర్ లైసెన్స్ పై ఆరు నల్లని చుక్కలు పెట్టారు. ఇది తొలినాళ్లలో 500 ధిర్హాం జరిమానాగా ఉండేది. ఆ తర్వాత దుబాయ్ పోలీసులు ఇదే విధమైన జరిమానాతో శిక్షించబడ్డారు. ఎమిరేట్స్ లోని టాఫిక్ ప్రచారంలో భాగంగా రోడ్డులను కలుషితం చేయటం, భద్రత మరియు అగ్ని ప్రమాదాలు సృష్టించే విధంగా వాహనాలను నడిపేవారిని నిలువరించేందుకు ఈ తరహా చర్యలు తీసుకోనున్నారు. దుబాయ్ మునిసిపాలిటీ ఏప్రిల్ నెలలో కేవలం ఒకే ఒక రోజున షేక్ జాయెద్ రోడ్డులో 30 కిలోల బరువు తూగే పారవేసిన సిగరెట్ల వ్యర్థాలను సేకరించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







