47 మద్యం సీసాలతో బంగ్లాదేశ్ దేశస్థుడు అరెస్టు; 40 మంది అక్రమ నివాసితులు పట్టివేత
- September 08, 2017
కువైట్ సిటీ: స్థానికంగా తయారుచేసిన 47 మద్యం సీసాలతో దొరికిపోయిన ఒక బంగ్లాదేశ్ దేశస్థుడిని పోలీసులు అరెస్టు చేశారు.భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఫెర్వనియా భద్రతా సిబ్బంది ఫెర్వానియా ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో గస్తీ అధికారులను గమనించిన ఆసియా దేశానికి చెందిన ఒక ప్రవాసీయుడు పరుగు పెట్టడం ప్రారంభించాడు. దాంతో అనుమానించిన ఆ అధికారులు ఆ వ్యక్తిని ఆపి అతని సంచిని తనిఖీ చేయగా 47 నీటి సీసాలలో స్థానికంగా తయారు చేయబడిన మద్యంను నింపాడు. దీనితో ఆ నిందితుడిని సంబంధిత అధికారులకు మద్యం సీసాలతో అరెస్టు చేసి అవసరమైన చట్టపరమైన చర్య కొరకు న్యాయాధికారుల ఎదుట ప్రస్తావించారు. ఇదే నేపథ్యంలో మరో నేపాల్ ప్రవాసీయుడిని అబల్ హాలిఫా ప్రాంతంలో స్థానికంగా తయారుచేసిన12 మద్యం సీసాలతో అరెస్ట్ చేశారు.ఆ నిందితుడిని మద్యం సీసాలతో సహా సంబంధిత అధికారులకు తదుపరి దర్యాప్తు నిమిత్తం అప్పగించారు.ఇటీవల జరిపిన భద్రత ప్రచారంలో భాగంగా జహ్రా సెక్యూరిటీ డైరెక్టరేట్ కు చెందిన అధికారులు పౌర, క్రిమినల్ నేరాలకు సంబంధించిన చట్టం ద్వారా కోరిన 5 వ్యక్తులతో సహా ఏ విధమైన గుర్తింపును చూపించలేని 40 మంది అక్రమ నివాసితులను పట్టుకున్నట్లు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్న15 మంది వాహనదారులను అరెస్ టుచేశారు గ్యారేజీలలో దాచిన వారి వాహనాలు ఈ సందర్భంగా స్వాధీనం చేసుకొన్నారు.రహదారి వినియోగదారులు మరియు నివాసితుల భద్రతకు వీలు కల్పించడానికి ఒక గరిష్ట కాల వ్యవధిలో గవర్నరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో ప్రచారం కొనసాగుతుందని భద్రతా అధికారులు పేర్కొన్నారు..
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







