సానియా-హింగిస్ కు రెండో విజమ్
- October 28, 2015
సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన 'రెడ్ గ్రూప్' లీగ్ మ్యాచ్‌లో సానియా-హింగిస్ ద్వయం 6-3, 6-4తో ఆండ్రియా హలవకోవా-లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) జోడీపై విజయం సాధించింది. 76 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసిన ఈ ఇండో-స్విస్ జోడీకి రెండో సెట్‌లో గట్టి పోటీ లభించింది. రెండో సెట్‌లో ఒకదశలో సానియా-హింగిస్ 1-4తో వెనుకబడ్డారు. అయితే వెంటనే తేరుకొని వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నారు. శుక్రవారం జరిగే తమ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో తిమియో బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)లతో సానియా-హింగిస్ తలపడతారు. వరుసగా రెండు విజయాలు సాధించిన సానియా జోడీకి సెమీఫైనల్ స్థానం దాదాపు ఖాయమైంది.
తాజా వార్తలు
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...







