తమిళనాడులో కొత్తగా అమ్మ జనసేన పార్టీ

- September 08, 2017 , by Maagulf
తమిళనాడులో కొత్తగా అమ్మ జనసేన పార్టీ

తమిళనాట కొత్త రాజకీయ పార్టీ స్థాపించుటకు సన్నాహాలు చేస్తున్నారు.  తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి  ఆధ్వర్యంలో అమ్మ జనసేన పార్టీ స్థాపించనున్నారు. అదే విధంగా పార్టీ జండాను కూడా ఖరారు చేశారు. ఈ పార్టీ ఆంధ్ర, తెలంగాణా ,కేరళ. పుదుచ్చేరి, కర్ణాటక ప్రాంతాల్లో స్థాపించబడుతోంది. ‘ దక్షిణాది ని రక్షిద్దాం ’... అనే నినాదం తో ఈ ప్రాంతాల్లో ప్రజల ముందుకు వస్తోంది.

దక్షిణాది లో ప్రధానమంత్రి, వారి మంత్రి వర్గ సహచరుల కార్యాలయాల సాధన, నేలలో 5 రోజులు ఇక్కడ ఉండే విధంగా పోరాటం చేయాలి. విద్యా, వేద్య, 50 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు నేలకు 5 వేలు అన్నదాత పేరుతో పెన్షన్ ఇచ్చే విధంగా పోరాటం. పిల్లలకు 1వ తరగతి నుండి డిగ్రీ వరకు ఉచిత విద్య, ప్రతిభ కనపరిచిన పేద విద్యార్థులకు విదేశీయానం అయ్యే ఖర్చులు ఉచితంగా చైల్లించటం, 15.000 లోపు జీతం గల ప్రభుత్వ ఉద్యోగులకు కత్తిరించడం లేకుండా చైల్లించటం, మల్టిఫ్లెక్స్‌ సినిమా థియేటర్ల లో కచ్చితంగా సగం సీట్లు ప్రవేశరుసుం రూ. 50కి మించకుండా ఉండటం. ప్రతి వికలాంగుడికి ఉద్యోగం, లంచగొండి ప్రభుత్వ ఉద్యోగులకు సర్వీస్ తో పని లేకుండా కచ్చితం గా ఉద్యోగ విరమణ, మరణించిన పేదలకు దహణసంస్కారం కొరకు రూ. 5.000 చెల్లించటం.  పట్టణ ప్రాంతాల్లో రద్దీ గా ఉండే ప్రాంతాల్లో నేరుగా ప్రజల వద్దకు పాలన, మీ సమస్య 24 గంటల్లో మా పరిస్సారం. ‘ సేవ్ దక్షిణ భారత్’. అనే నినాదం తో ఈ పార్టీ పనిచేస్తుంది. అని కేతిరెడ్డి తెలిపారు. అక్టోబర్ 2 న గాంధీ, జయలలిత సమాధి వద్ద ప్రతిన బూని పాదయాత్ర ద్వారా దక్షిణ భారతదేశం మొత్తం తిరిగి ప్రజాధికారం విలువ లను ప్రజలకు తెలియ చేయనున్నట్లు.. ఓటు కు ఉన్న సత్తాను, అలాగే తన ఉద్దేశ్యం ను ప్రజలకు ఈ పాదయాత్ర ద్వారా తెలుపనున్నట్టు కేతిరెడ్డి  తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com