సౌదీ అరేబియా వరల్డ్‌ కప్‌ విక్టరీ: ఎస్‌టిసి ఫ్రీ కాల్‌ ఆఫర్స్‌

- September 09, 2017 , by Maagulf
సౌదీ అరేబియా  వరల్డ్‌ కప్‌ విక్టరీ: ఎస్‌టిసి ఫ్రీ కాల్‌ ఆఫర్స్‌

జెడ్డా: సౌదీ టెలికామ్‌ కంపెనీ, రెండ్రోజులపాటు ఉచిత కాల్‌ ఆఫర్స్‌ని ప్రకటించింది. సౌదీ నేషనల్‌ టీమ్‌, రష్యాలో జరిగే 2018 వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌కి అర్హత సాధించడంతో ఈ ఆఫర్‌ని అందిస్తున్నట్లు ఎస్‌టిసి వర్గాలు వెల్లడించాయి. ఎస్‌టిసి నుంచి ఎస్‌టీసీ నెట్‌వర్క్‌ అలాగే ఇతర నెట్‌వర్క్‌లకు వెళ్ళే కాల్స్‌పై ఈ ఉచిత ఆఫర్‌ లభించనుంది. ఎస్‌టిసి గ్రూప్‌ సిఇఓ డాక్టర్‌ ఖలీద్‌ హెచ్‌ బియారి మాట్లాడుతూ, గురువారం నుంచి శనివారం వరకు ఈ ఉచిత కాల్స్‌ అందుబాటులో ఉంటాయని చెప్పారు. అపరిమిత ఉచిత కాల్స్‌తో వినియోగదారులు ఈ ఆఫర్‌ని ఎంజాయ్‌ చేయొచ్చని ఆయన వివరించారు. ఈ ఆఫర్‌ గురించి ఇప్పటికే ఎస్‌టిసి వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో సమాచారం అందించినట్లు ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com