పోలీసులపై దాడి చేసిన దుబాయ్ మద్యం అక్రమ వర్తకునికి జైలు శిక్ష

- September 09, 2017 , by Maagulf
పోలీసులపై దాడి చేసిన దుబాయ్ మద్యం అక్రమ వర్తకునికి జైలు శిక్ష

దుబాయ్: నల్గురు మద్యం అక్రమ వర్తకులతో ఒక వ్యక్తి  తన సహచరుల అరెస్టును అడ్డుకోవడం, పోలీసు అధికారిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ నిందితుడిని దోషిగా దుబాయ్ క్రిమినల్ కోర్టు నిర్ధారించింది . 28 ఏళ్ల ఫిలిప్పిన్ ప్రతివాది తన దేశానికి చెందిన ముగ్గురు దేశస్థులను అరెస్ట్ చేయడంపై ప్రతిఘటించి ఏకంగా పోలీసులపైనే దాడికి పాల్పడ్డాడు. గత ఏడాది డిసెంబర్ 24 వ తేదీన జరిగిన ఈ ఘటనలో  28 ఏళ్ళ వయస్సు నుండి 47 సంవత్సరాల మధ్య వయస్సున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం అమ్మకం జరుపుతున్నట్లు సమాచారం అందుకొని వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించిన ఐదుగురు పోలీసు అధికారులను ఆ నిందితులు ఎదురు తిరిగి దాడికి పాల్పడ్డారు." ఇద్దరు అధికారులు కొనుగోలుదారులుగా భావించి  ఎదురుచూశారు, ముద్దాయిలలో ఒకరు ఒక ట్రక్కు కింద దాచి ఉంచిన బీరును విక్రయించారు. "ఇద్దరు అధికారులను వారు గుర్తించారు. మేము వారిని వెంటాడిన సమయంలో మాలో ఒక సహోద్యోగి వారికి పట్టుబడ్డాడు. దానితో ఆ పోలీస్ అధికారిపై  దాడి చేశారని అధికారి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com