యూఎస్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్న స్లోన్ స్టీఫెన్స్
- September 09, 2017
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో అమెరికా క్రీడాకారిణి అన్‌సీడెడ్ స్లోన్ స్టీఫెన్స్ విజయం సాధించి కెరీర్లో తొలి గ్రాండ్ స్లామ్ సొంతం చేసుకుంది. శనివారం అర్థరాత్రి జరిగిన ఫైనల్లో మరో అమెరికా క్రీడాకారిణి 15వసీడ్ మాడిసన్ కీస్పై 6-3,6-0 వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. మాడిసన్ ఎలాంటి పోటీని ఇవ్వలేకపోవడంతో స్టీఫెన్స్ అలవోకగా విజయం సాధించింది.
2002 తర్వాత ఇద్దరు అమెరికన్ల మధ్య టైటిల్ పోరు జరిగింది. విలియమ్స్ సిస్టర్స్ మధ్య 15 ఏళ్ల క్రితం ఫైనల్ పోరు జరగగా తుదిపోరులో సెరెనా విలియమ్స్... తన సోదరి వీనస్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఈ విజయంతో స్లోన్ స్టీఫెన్స్ 3.7 మిలియన్ యూరోలను బహుమతిగా అందుకుంది. మాడిసన్ కీస్ మొత్తం 30 అనవసర తప్పిదాలు చేయగా స్లోన్ స్టీఫెన్స్ కేవలం 6తప్పిదాలే చేయడంతో విజయం సులువైంది. ఈ విజయంతో స్టీఫెన్స్ అన్‌సీడెడ్ ప్లేయర్‌గా మహిళల గ్రాండ్‌స్లామ్ టైటిల్ అందుకున్న 5వ క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఇక 1976 తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్ గేమ్ త్వరగా ముగియడం ఇదే ప్రథమం.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









