'స్పైడర్' ఆడియో ఫంక్షన్ లో మహేష్ పై మురగదాస్ సంచలన కామెంట్స్

- September 09, 2017 , by Maagulf
'స్పైడర్' ఆడియో ఫంక్షన్ లో మహేష్ పై మురగదాస్ సంచలన కామెంట్స్

మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'స్పైడర్' ఆడియో లాంచ్ ఫంక్షన్ నిన్న చెన్నైలో అత్యంత ఘనంగా జరిగింది. ప్రిన్స్ మహేష్ బాబుకు తమిళ ప్రేక్షకులు అత్యంత ఘనంగా స్వాగతం పలుకుతున్నారు అని చెప్పే విధంగా ఈ ఆడియో ఫంక్షన్ కు విపరీతమైన జనం రావడమే కాకుండా ఈ ఆడియో ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ ను అనేక మంది తమిళ ఛానల్స్ లో అత్యంత ఆశక్తిగా వీక్షించారు.
అందరు ఆశ్చర్యపోయే విధంగా 'జై జై సూపర్ స్టార్ మహేష్ బాబు' అనే నినాదాలతో ఈ ఆడియో ఫంక్షన్ చెన్నైలో జరగడం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో దర్శకుడు మురగదాస్ చేసిన వ్యాఖ్యలు ఈ కార్యక్రమానికి హైలెట్ గా నిలిచాయి.

మహేష్ మంచితనం పట్టుదల క్రమశిక్షణ గురించి ప్రశంసలు కురిపించిన మురగదాస్ మహేష్ లాంటి హీరోతో సినిమా తీయడానికి ఏ టాప్ డైరెక్టర్ అయినా ఎందుకు ఇష్ట పడతాడో తనకు ఇప్పుడు అర్ధం అయింది అని అంటూ మహేష్ ను ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాదు 'స్పైడర్' ఈ సంవత్సరంలో విడుదల కాబోతున్న బ్లాక్ బస్టర్ అంటూ ఈమూవీ పై అంచనాలు పెంచేసాడు మురగదాస్.

తాను వాస్తవానికి 'గజిని' సినిమాను మహేష్ తో రీమేక్ చేయాలని భావించిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ ఆ తరువాత 'తుపాకీ' సినిమాను కూడ మహేష్ తో తెలుగులో తీయాలని ప్రయత్నించిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు మురగదాస్. నటన పట్ల మహేష్ అంకిత భావాన్ని బయట పెడుతూ 'స్పైడర్' లో మహేష్ తప్ప మరెవ్వరూ ఆ పాత్రకు సరిపోరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు మురగదాస్. నిన్న జరిగిన ఈ ఫంక్షన్ తీరు బట్టి తమిళనాడులో 'స్పైడర్' కు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా మహేష్ బాబు ఫాన్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా డిడ్డి రాంబాబు వ్యవహరిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com