ఇర్మా తుఫాను హెచ్చరిక జారీచేసిన ట్రంప్
- September 09, 2017
వరుస తుఫానుల విలయం అమెరికాను అతలాకుతలం చేస్తోంది. కరిబియన్ దీవులను కుదిపేసిన.. ఇర్మా.. క్యూబాను తాకి.. ఫ్లోరిడా వైపు దూసుకెళ్తోంది. హరికేన్ ప్రభావంతో క్యూ అంతటా భారీ వర్షాలు పడుతున్నాయి.. ఐదో కేటగిరీగా ప్రకటించిన ఇర్మా.. తాకిడితో క్యూబా తీర ప్రాంతాల తీవ్రంగా నష్టపోయాయి. గంటకు దాదాపు 260 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో ఎప్పుడేం జరుగుతుందో అని స్థానికులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.. చాలా చోట్ల విద్యుత్తు, టెలిఫోన్ స్తంభాలు నేలకూలడంతో సేవలు నిలిచిపోయాయి. పర్వత ప్రాంతాల్లో వరదలు తీవ్రం కావడంతో స్థానికులను, పర్యాటకులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇర్మా హరికేన్ ఇవాళ ఫ్లొరెడా రాష్ట్రాన్ని తాకవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్లోరిడాకు ఇర్మా ముప్పు పొండి ఉండడంతో భారత విదేశాంగ శాఖ స్పందించింది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని భారతీయుల క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. ఇర్మా దెబ్బకు అమెరికా, వెనిజులా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌లో పెను ప్రభావం ఉందని.. విదేశాంగ శాఖ ప్రతినిధులు ట్వీట్ చేశారు. ఆయా దేశాల అధికారులతో టచ్‌లో ఉన్నట్టు ప్రకటించారు. బారతీయులు ఫోన్ చేయాల్సిన నంబర్లను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. హరికేన్ విలయం ధాటికి ఇప్పటివరకూ 23 మంది మృతి చెందగా.. వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. 13 లక్షల మందికి పైగా ఇర్మా ధాటికి నష్టపోయారు. హరికేన్ కేంద్రం నేరుగా బర్బుడా మీదుగా వెళ్లడంతో ఆ దీవి తుడిచిపెట్టుకుపోయింది. మరోవైపు, అట్లాంటిక్ తీరాన్ని వరుస హరికేన్లు వణికిస్తున్నాయి. హార్వే విధ్వంసాన్ని మరచిపోకముందే ఇర్మా హరికేన్ కరేబియన్ దీవుల్లో, క్యూబాలో విలయం సృష్టిస్తే.. అదే రోజు అట్లాంటిక్ సముద్రంలో జోస్ హరికేన్ పుట్టింది. ఇది కూడా మరింత బలపడి ఇర్మా దారిలోనే పయనిస్తోందని అమెరికా వాతావరణ వేత్తలు గుర్తించారు. అటు మెక్సికన్ గల్ఫ్ కోస్ట్‌పై కటియా హరికేన్ విరుచుకుపడుతోంది. ఏడేళ్ల తర్వాత మళ్లీ హరికేన్లు చుట్టుముట్టడంతో అమెరికన్లు ప్రకృతి బీభత్సానికి వణికిపోతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..







