భారతీయులు క్షేమమే అంటున్న సుష్మ
- September 10, 2017
దిల్లీ: కారకాస్ (వెనిజులా రాజధాని), హవానా (క్యూబా రాజధాని), జార్జ్‌టౌన్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో ఉన్న భారతీయులంతా క్షేమంగా ఉన్నట్లు విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. హరికేన్ ఇర్మా ధాటికి ఆయా ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అక్కడ నివసించే భారతీయుల క్షేమ సమాచారాన్ని దౌత్య అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. ఫ్లోరిడాలో నివసించే భారతీయులను అట్లాంట తరలించేందుకు అన్ని సిద్ధం చేసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్‌కుమార్ ట్విటర్ ద్వారా తెలిపారు. కొంతమంది ఇప్పటికే అట్లాంట చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు. కరీబియన్ దీవుల్లో ఇర్మా కారణంగా దాదాపు 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
హరికేన్ ఇర్మా ప్రభావిత ప్రాంతాల్లో 24గంటలూ అందుబాటులో ఉండే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి కోసం సింట్ మార్టెన్ నుంచి ఆహారపదార్థాలను పంపిస్తున్నారు. వాషింగ్టన్ డీసీలోని భారత దౌత్య కార్యాలయంలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.
సహాయం కోసం 202 258 8819 నంబరుకు ఫోన్ చేయాల్సిందిగా ట్విటర్ ద్వారా తెలిపారు.ఇర్మా ఉద్ధృతమై 4వ కేటగిరీ హరికేన్‌గా మారినట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









