7 మిలియన్‌ దిర్హామ్‌ రాఫిల్ విన్నర్‌: ప్రైజ్‌ మనీ షేరింగ్‌

- September 10, 2017 , by Maagulf
7 మిలియన్‌ దిర్హామ్‌ రాఫిల్ విన్నర్‌: ప్రైజ్‌ మనీ షేరింగ్‌

యు.ఏ.ఈ:7 మిలియన్‌ దిర్హామ్‌ల బంపర్‌ ప్రైజ్‌ని రఫాలే డ్రాలో గెలుచుకున్న మాథ్యూ, ఎట్టకేలకు ఈ బంపర్‌ ప్రైజ్‌ దక్కించుకోవడంపై స్పందించారు. తన ఫోన్‌ నీటిలో పడిపోవడంతో బిగ్‌టికెట్‌ నిర్వాహకులు తనను సంప్రదించలేకపోయారనీ, ఆ తర్వాత వారు తనతో కమ్యూనికేట్‌ చేశారని తెలిపారు మాథ్యూ. కేరళలోని కొచ్చికి చెందిన మాథ్యూ, తాను గెలుచుకున్న బంపర్‌ ప్రైజ్‌ మనీని ఇద్దరు స్నేహితులతో పంచుకోన్నుట్లు చెప్పారు. అందులో ఒకర భారతీయ వ్యక్తి కాగా, మరొకరు పాకిస్తానీ వ్యక్తి. ఆ ఇద్దరూ తాను టికెఎ్కట్‌ కొనుగోలు చేయడానికి సాయం చేశారని మాథ్యూ చెప్పారు. తాను గెలుచుకున్న 7 మిలియన్‌ దిర్హామ్‌లలో 3.5 మిలియన్‌ దిర్హామ్‌ని ఆ ఇద్దరికీ ఇవ్వనున్నాని మాథ్యూ వివరించారు. గెల్చుకున్న ప్రైజ్‌ మనీతో ఏం చేయాలనేదానిపై ఇంకా నిర్ణయించుకోలేదనీ, తన కుమారుడు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాడనీ, కుమార్తె ప్రత్యేకావసరాలు గల వ్యక్తి అని మాథ్యూ వెల్లడించారు. సెప్టెంబర్‌ 17న మాథ్యూ అల్‌ అయిన్‌కి తిరిగి రానున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com