బహ్రెయిన్‌లో ఉచిత మెడికల్‌ క్యాంప్‌

- September 10, 2017 , by Maagulf
బహ్రెయిన్‌లో ఉచిత మెడికల్‌ క్యాంప్‌

ఇండియన్‌ కమ్యూనిటీ రిలీఫ్‌ ఫండ్‌ (ఐసిఆర్‌ఎఫ్‌), ఎయిర్‌మెక్‌ డబ్యుఎల్‌ఎల్‌ వద్ద సెప్టెంబర్‌ 28న సాయంత్రం 5.30 నుంచి 8.30 గంటల వరకు మెడికల్‌ క్యాంప్‌ని నిర్వహిస్తోంది. సీనియర్‌ మెడికల్‌ కనల్టెంట్లు ఈ మెడికల్‌ క్యాంపుకు హాజరయ్యే కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. హెల్త్‌ అవేర్‌నెస్‌, అలాగే సేఫ్టీ టిప్స్‌, ఎల్‌ఎంఆర్‌ఎ గైడ్‌ లైన్స్‌ తెలియజేసేలా ఇక్కడి కార్యక్రమాలుంటాయని నిర్వాహకులు తెలిపారు. ఎయిర్‌మెక్‌ ఉద్యోగులు, ఇతరులకు ఈ క్యాంప్‌ సేవలందిస్తుంది. బహ్రెయిన్‌లో 2002 నుంచి ఐసిఆర్‌ఎఫ్‌ పలు కార్యక్రమాల్ని చేపడుతోంది. బహ్రెయిన్‌లోని పలు లేబర్‌ సైట్స్‌లో 122 మెడికల్‌ చెకప్‌ క్యాంప్స్‌ని నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపుల ద్వారా 41,600 మంది కార్మికులు లబ్ది పొందారు. భారతీయ వలస కార్మికుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం ఈ క్యాంపుల ముఖ్య ఉద్దేశ్యమని ఐసిఆర్‌ఎఫ్‌ సోషల్‌ వర్కర్‌ సుధీర్‌ తిరునిలత్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com