యూఏఈ ఫ్యూయల్‌ కోసం ఎన్‌ఓఎల్‌ కార్డులు

- September 11, 2017 , by Maagulf
యూఏఈ  ఫ్యూయల్‌ కోసం ఎన్‌ఓఎల్‌ కార్డులు

మిరేట్స్‌ నేషనల్‌ ఆయిల్‌ కంపెనీ (ఇఎన్‌ఓసి), దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ)తో కలిసి చేసుకున్న ఒప్పందంలో భాగంగా, వినియోగదారులు తమ ఎన్‌ఓఎల్‌ కార్డుల్ని, ఇఎన్‌ఓసి రిటైల్‌ నెట్‌వర్క్‌లో ఎక్కడైనా వినియోగించుకుని ఫ్యూయల్‌ని పొందడానికి వీలుంది. ఫ్యూయల్‌తోపాటుగా పలు సేవలు పొందేందుకు, అలాగే జూమ్‌లో కొనుగోళ్ళకు, ప్రాంటో, పావోస్‌ పిజ్జా కొనుగోళ్ళకు ఎన్‌ఓల్‌ కార్డుని వినియోగించుకునే వీలుంది. క్లాష్‌ లెస్‌ పేమెంట్స్‌లో భాగంగా స్మార్ట్‌ డివైజ్‌ల వినియోగం పెరగడంతో, టెక్నాలజీని అందిపుచ్చుకునే ఈ క్రమంలో కీలకమైన ముందడుగు వేసినట్లు ఇఎన్‌ఓసి, ఆర్‌టిఎ వర్గాలు వెల్లడించాయి. దుబాయ్‌ వ్యాప్తంగా వెయ్యికి పైగా రిటైల్‌ ఔట్‌లెట్స్‌లో ఈ కార్డుల్ని వినియోగించుకోవచ్చు. ఇఎన్‌ఓసి 118 సర్వీస్‌ స్టేషన్లను యూఏఈ వ్యాప్తంగా కలిగి ఉంది. అలాగే 221 జూమ్‌ ఔట్‌లెట్స్‌ని మెట్రోస్టేషన్స్‌ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com