పాఠశాలకు వెళ్లి.. పిల్లలతో గడిపిన దుబాయ్ రాజు
- September 11, 2017
యూఏఈ: దుబాయ్ లో పాఠశాలలు 10 వ తారీఖుతో పున:ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యారు. కొత్త తరగతులు, కొత్త పాఠ్యపుస్తకాలతో పిల్లలు కుస్తీ పడుతున్నారు. విద్యాసంవత్సరం మొదలయిన మొదటిరోజే.. విద్యార్థులకు కలలో కూడా ఊహించని సంతోషకర అనుభవం ఎదురైంది. స్వయంగా దుబాయ్ రాజు వారి వద్దకు వచ్చి.. బాగా చదువుకోండంటూ ముచ్చటించడం విద్యార్థుల్లో సంతోషాన్ని కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఆదివారం కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయిన సందర్భంగా దుబాయ్ రాజు, యూఏఈ ప్రధానమంత్రి అయిన షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కొన్ని పాఠశాలలను సందర్శించారు. ఆయనతోపాటు అత్యున్నత పదవిలో ఉన్న కొందరు మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారు. అధికారులకు, పాఠశాలల యాజమాన్యాలకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఆయన చేసిన ఆకస్మిక పర్యటన చాలామందిని ఆశ్చర్యపరిచింది. పిల్లలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. పిల్లలు దేశ భవిష్యత్తుకు చిహ్నమని, వారు ఉన్నత మార్గంలో ఉంటే దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా మహ్మద్ బిన్ రషీద్ అభిప్రాయపడ్డారు. పిల్లలతో దుబాయ్ రాజు గడిపిన మధురక్షణాల గురించి దుబాయి అధికారిక మీడియా ట్విటర్లో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









