కంచె ఐలయ్య పుస్తకంపై తెలంగాణ,ఏ.పి రాష్ట్రాల్లో రగడ
- September 11, 2017
మాజీ ప్రొఫెసర్ కంచె ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకం వివాదాస్పదమైంది. ఐలయ్య రాసిన పుస్తకంపై ఆర్య వైశ్యులు భగ్గుమన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఐలయ్యకు వ్యతిరేకంగా ప్ల కార్డులతో ధర్నా నిర్వహించారు. వైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన ఐలయ్యపై చర్య తీసుకోవాలంటూ తహసీల్దార్ సురేష్ కు వినతి పత్రం సమర్పించారు.
అటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం కాటేదాన్ శివరాంపల్లిలోను వైశ్యులు ఆందోళన నిర్వహించారు. శ్రీ వాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మైలార్ దేవ్ పల్లి చౌరస్తా ఐలయ్య బొమ్మ దగ్ధం చేశారు. గతంలోను ఐలయ్య అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ నాయకులు గణేష్ గుప్తా ఆరోపించారు. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంతో తమ మనోభావాలు కించపరిచిన ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







