స్వల్పంగా తగ్గినా బంగారం ధరలు
- September 12, 2017
ఒకరోజు భారీగా పైకి ఎగుస్తూ.. మరోరోజు భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు, మంగళవారం మళ్లీ కిందకి పడిపోయాయి. ఈక్విటీలు, డాలర్ పైకి ఎగియడంతో పసిడి పరుగుకు బ్రేక్‌పడింది. 150 రూపాయల నష్టంలో రూ.31వేల మార్కుకు కిందకి పడిపోయింది. నేటి బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.30,850గా నమోదైంది. ఉత్తర కొరియా టెన్షన్లు కొంత తగ్గుముఖం పటట్టడంతో, సురక్షిత ఆస్తులుగా ఉన్న బంగారం, జపనీస్ యెన్, స్విస్ ఫ్రాంక్, ట్రెజరీలకు డిమాండ్ పడిపోయింది. వెండి ధరలు కూడా స్వల్పంగా 50 రూపాయల నష్టంలో కేజీకి రూ.41,650గా నమోదయ్యాయి.
అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్‌తో పాటు స్థానిక జువెల్లర్స్, రిటైలర్ల నుంచి డిమాండ్ లేకపోవడంతో బంగారం ధరలు తగ్గుతున్నట్టు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గ్లోబల్‌గా బంగారం 0.08 శాతం పడిపోయి, సింగపూర్ ఔన్స్ బంగారం ధర 1,325.90 డాలర్లుగా నమోదైంది. వెండి కూడా 0.31 శాతం కిందకి పడిపోయి ఔన్స్‌కు 17.70 డాలర్లుగా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 150 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,850గా, రూ.30,700గా నమోదయ్యాయి. సోమవారం ట్రేడింగ్‌లో ఈ ధరలు 470 రూపాయలు బలపడ్డాయి.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







