భారీ స్థాయిలో విడుదల అవుతున్న 'స్పైడర్'
- September 12, 2017
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'స్పైడర్'. సెప్టెంబరు 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేశ్ తొలిసారి తమిళంలో నటించిన చిత్రమిది. దీంతో భారీ స్థాయిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అమెరికాలో దాదాపు 800 స్క్రీన్లపై ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారట. అక్కడ 'స్పైడర్'ను పంపిణీ చేస్తున్న అట్మాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి చిత్రాన్ని దాదాపు 800 స్క్రీన్లపై ప్రదర్శిస్తున్నట్లు పేర్కొంది. మహేశ్ సినీ కెరీర్‌లో అమెరికాలో అత్యధిక స్క్రీన్లపై విడుదల అవుతున్న చిత్రం ఇదేననని చెబుతున్నారు.
'బాహుబలి 2'ను అమెరికాలో 1000 స్క్రీన్లపై ప్రదర్శించారు. అక్కడ అత్యధిక స్క్రీన్లపై ప్రదర్శించిన తొలి తెలుగు చిత్రమిదే. దీని తర్వాతి స్థానాన్ని 'స్పైడర్' దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఎ.ఆర్. మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటించారు. ఎస్.జె. సూర్య ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఈ నెల 15న చిత్రం ప్రీ-రిలీజ్ వేడుకను శిల్పకళా వేదికలో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







