ఐసిస్ చెరనుండి ఫాదర్ టామ్ విడుదల
- September 12, 2017
గతేడాది యెమెన్‌లో తీవ్రవాదుల చేతికి చిక్కిన కేరళకు చెందిన క్రైస్తవ మతాధిపతి టామ్ ఉళున్నాలిల్‌ను భారత, ఒమన్ ప్రభుత్వాలు విజయవంతంగా రక్షించాయి. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్లో వెల్లడించారు.
2016, మార్చి 4న యెమెన్‌లోని ఏడెన్ ప్రాంతంలో మిషనరీస్ ఆఫ్ ఛారిటీలపై ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు దాడి చేశారు. ఆ దాడిలో దాదాపు 16 మంది చనిపోయారు. మతాధిపతిని తీవ్రవాదులు చెరలో బంధించారు. ఈ ఏడాది మేలో తనను కాపాడాలని కోరుతూ టామ్ ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాడు.
కిడ్నాపర్లు తమ డిమాండ్లను చెప్పేందుకు భారత ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు టామ్ ఆ వీడియోలో పేర్కొన్నారు. .. ఆయన కిడ్నాప్ అయినప్పటి నుంచి భారత ప్రభుత్వం ఆయన్ను విడిపించేందుకు ప్రయత్నాలు చేసింది. ఇండియాతో పాటు ఓమన్ ప్రభుత్వం కూడ టామ్‌ను విడిపించేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతమయ్యాయి.
ప్రస్తుతం టామ్ ఒమన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అతని విడుదలకు సంబంధించిన ఫొటోను ఒమన్ మీడియా ప్రసారం చేసింది. రెండ్రోజుల్లో ఒమన్ నుంచి న్యూఢిల్లీకి టామ్‌ను తీసుకురానున్నట్లు సమాచారం.
అంతేగాక . తాజాగా ఆయనను సురక్షితంగా విడిపించినట్లు కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు.టామ్ రక్షించినందుకు అతని కుటుంబ సభ్యులు, క్రైస్తవ మతాధిపతులు భారత, ఒమన్ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







