వలసదారుల నిషేధంపై అమెరికాకి తాత్కాలిక వూరట: సుప్రీంకోర్టు

- September 13, 2017 , by Maagulf
వలసదారుల నిషేధంపై అమెరికాకి తాత్కాలిక వూరట: సుప్రీంకోర్టు

 వలసదారులపై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయానికి అమెరికా సుప్రీంకోర్టు దన్నుగా నిలిచింది. నిషేధాన్ని సడలిస్తూ, అక్టోబరు నెలాఖరులోగా 24 వేల మంది శరణార్థుల్ని దేశంలోకి అనుమతించడానికి దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని రద్దు చేయాలని ట్రంప్‌ యంత్రాంగం చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తులు అనుమతించారు. అయితే తుదితీర్పు వెలువడాల్సి ఉంది. ముస్లింల ఆధిక్యంఉన్న ఆరు దేశాలు, ప్రపంచంలోని ఎక్కడినుంచైనా శరణార్థులు అమెరికాకు రాకుండా ట్రంప్‌ విధించిన నిషేధంపై వాదనలు అక్టోబరు 10న కొనసాగనున్నాయి. ముందు ప్రకటించిన ప్రకారం ముస్లిం దేశాలపై విధించిన 90 రోజుల నిషేధం ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. శరణార్థులపై నిషేధం వచ్చే నెలాఖరు వరకు ఉంటుంది. వీటిని కొనసాగిస్తారా, శాశ్వత ప్రాతిపదికన ఆంక్షలు విధిస్తారా, లేదా ఇతర దేశాలనూ జాబితాలో చేరుస్తారా అనేది యంత్రాంగం ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వ ఉత్తర్వులోని కీలక అంశాలను న్యాయస్థానం సమర్థించిందని శ్వేతసౌధం ప్రతినిధి వ్యాఖ్యానించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com