సింగపూర్లో తొలిసారి ఒక మహిళా అధ్యక్షురాలిగా....
- September 13, 2017
సింగపూర్ అధ్యక్షురాలి గా తొలిసారి ఓ మహిళ ఎంపికయ్యారు. అది కూడా ఒక్క ఓటు సహాయం కూడా లేకుండా. పార్లమెంటు స్పీకర్‌గా పనిచేసిన ముస్లిం మాలే మైనారిటీకి చెందిన హలీమా యాకోబ్ (63) అనే మహిళను సింగపూర్ అధ్యక్షురాలిగా ప్రకటించారు. సింగపూర్ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే ఈ ఘట్టంపై విమర్శలు వెల్లువెత్తాయి. అత్యంత కీలకమైన అధ్యక్ష పదవిని ఎన్నికలు నిర్వహించకుండా ఎలా కట్టబెడతారంటూ చర్చ మొదలైంది. ఎలాంటి అర్హత నియమాలు పాటించకుండానే ఆమెను అధ్యక్షురాలిగా నియమించారంటూ ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకే పార్టీ కొన్ని దశాబ్దాలుగా సింగపూర్‌ను పరిపాలిస్తూ వస్తోంది. ఈ సారి మాలే వర్గానికి ఆ బాధ్యతలు అప్పగించాలనుకోవడం,
అయితే, ఎవరికి ఇవ్వాలనే విషయంలో ఎన్నికలు నిర్వహించకుండానే ఏకపక్షంగా హలీమాకు కట్టబెట్టడం అదే వర్గంలోని కొందరికి మింగుడు పడటం లేదు. దీనిపై సోషల్ మీడియాలో కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 'ఎన్నికలు లేకుండా ఎన్నికయ్యారు.. ఇదొక హాస్యాస్పదం' అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. పీపుల్స్ యాక్షన్ పార్టీకి చెందిన హలీమా దాదాపు 20 ఏండ్లుగా అదే పార్టీలో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







